వాణిజ్య యుద్ధం ఆపండి
చైనాతో కొనసాగిస్తున్న వాణిజ్య యుద్ధం తమ వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని, గనుక దీనికి వెంటనే తెర దించాలని నైకీ, ఇతర బడా షూ తయారీ కంపెనీలు ట్రంప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. నైకీ, అడిడాస్‌తో పాటు మరో 173 షూ తయారీ కంపెనీలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను డిమాండ్ చేశాయి. చైనా దిగుమతులపై సుంకాలను భారీగా పెంచుతూ ట్రంప్ నిర్ణయం తీసుకోవడం, దానికి ప్రతిగా చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై సుంకాలు పెంచిన సంగతి తెలిసిందే. ఈ వాణిజ్య యుద్ధం అటు వినియోగాదారులపైన, ఇటు శ్రామిక వర్గంపైన తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ఈ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. సుంకాల పెంపుదలతో కొన్ని రకాల వ్యాపారాలకు భవిష్యత్‌లో విఘాతం కలుగుతుందని ఈ కంపెనీలు హెచ్చరించాయి. ఇరుదేశాల మధ్య వాణిజ్య పోరుకు ముగింపు పలకాలని అవి విజ్ఞప్తి చేశాయి.













