అమెరికాతో చర్చలు అసాధ్యం
ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాతో వాణిజ్య చర్చలు అసాధ్యమని చైనా సృష్టం చేసింది. ఇప్పటి వరకు చైనా, అమెరికా అధికారులు వాణిజ్య వివాదానికి సంబంధించి ఎటువంటి చర్చలు నిర్వహించలేదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గెంగ్ఘవాంగ్ మీడియాకు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరువైపులా చర్చలు చేపట్టడం సాధ్యం కాదన్నారు. అదనంగా మరో 100 బిలియన్ డాలర్ల విలువైన చైనా దిగుమతులపై టారిఫ్లు విధించనున్నట్టు ఆమెరికా అధ్యక్షుడు గత శుక్రవారం హెచ్చరించిన విషయం విదితమే. అయితే, తర్వాత ఆయన ఒక అడుగు వెనక్కి తగ్గారు. వివాదానికి ముగింపు కనుగొన్నానని, చైనా తన వాణిజ్య హద్దులను పక్కన పెడుతుందని ట్రంప్ పేర్కొనడం గమనార్హం.













