పాక్ ను ఆదేశించిన అమెరికా
ఉగ్రదాడులను జరుపుతున్న తాలిబన్ల నాయకులను తక్షణమే అరెస్టు చేయాల్సిందిగా పాకిస్థాన్‌కు అమెరికా ఆదేశించింది. వారు అఫ్గానిస్తాన్ సరిహద్దుల వెంబడి విస్తరించి ఉన్నట్లు కూడా పేర్కొంది. కాబూల్‌లో విలాసవంతమైన ఒక హోటల్‌పై కొద్ది రోజుల క్రితం ఉగ్రదాడిలో 22 మంది మరణించాక అమెరికా ఈ ఆదేశం ఇచ్చింది. కాబూల్‌లోని ఇంటర్ కాంటినెంటల్ హోటల్‌పై దాడికి బాధ్యత తమదేనని తాలిబన్ ప్రకటన వెలువడ్డాక వైట్‌హౌస్ ప్రకటన వెలువడింది. దాడి తర్వాత సరిహద్దుల వద్ద మోహరించి ఉన్న తాలిబన్లను దేశం నుంచి వెళ్లగొట్టాలని లేదా తక్షణమే అరెస్టు చేయాలని ఆ ప్రకటనలో పాక్‌ను ఆమెరికా ఆదేశించింది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ సారా సాండర్స్ ఈ విషయం చెప్పారు. పాక్ తన భూ భాగాల నుంచి టెర్రరిస్టు స్థావరాలను తొలగించాలని కూడా గట్టిగా కోరింది.













