పాకిస్థాన్ కు అమెరికా మరోసారి వార్నింగ్
భారత్ ఎయిర్ స్ట్రైక్స్ నేపథ్యంలో పాకిస్థాన్‌ను అగ్రరాజ్యం అమెరికా మరోసారి హెచ్చరించింది. పాక్ గడ్డపై ఉన్న ఉగ్రవాద తండాల విషయంలో చర్యలు చేపట్టాలని ఆదేశించింది. పాక్, భారత్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రికత్తల నేపథ్యంలో ఆ దేశ విదేశాంగ సెక్రటరీ మైక్ పోంపియో ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో పాక్‌పై సునిశిత వ్యాఖ్యలు చేశారు. భారత్ చేపట్టిన ఎయిర్ స్ట్రైక్స్‌ను కౌంటర్ టెర్రరిజంలో భాగమని అభివర్ణించారు. ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయకుంటే పాకిస్థాన్‌కే నష్టం జరుగుతుందని హితవు పలికారు. ఉగ్రవాదంపై తీరు మార్చుకోవాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు సూచించారు. భారత్‌పై కవ్వింపు చర్యలకు తగవని హెచ్చరించారు. సరిహద్దులో ఉద్రికత్త తగ్గించాలని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఖురేషీకి సూచించారు. ఫిబ్రవరి 26 దాడులపై తాను భారత విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్‌తో మాట్లాడనని సరిహదద్దుల్లో శాంతి పరిరక్షణకు తోడ్పాటునందిస్తామని చెప్పినట్లు మైక్ తెలిపారు.













