మహిళా జవాను ఆచూకి చెబితే భారీ రివార్డు …
అమెరికాలో కనిపించకుండా పోయిన మహిళా జవాను వానెస్సా గిల్లెన్ (20) సమాచారం తెలిపిన వారికి 2500 డాలర్ల (దాదాపు 19 లక్షల రూపాయలు) భారీ రివార్డును అమెరికా ఆర్మీ ప్రకటించింది. చివరిసారిగా ఏప్రిల్ 22న టెక్సాస్‌లోని ఫోర్ట్‌హుడ్ ఆర్మీ బేస్‌లోని కార్‌పార్కింగ్‌లో గిల్లెన్ కనిపించినట్టు సమచారం. గిల్లెన్ ఐడీ కార్డు, వాలెట్లను అదే రోజు ఉదయం ఆమె పనిచేస్తున్న ఆయుధాలు భద్రపరిచే గదిలో లభించాయి. గిల్లెన్ కనిపించకుండా పోవడంపై ఆమె కుటుంబ సభ్యులు లీగ్ ఆఫ్ యునైటెడ్ లాటిన్ అమెరికన్ సిటిజన్స్ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. గిల్లెన్ ఆచూకీ చెప్పాలంటూ ఆర్మీ కార్యాలయం ఎదుట, గిల్లెన్ స్వస్థలంలో ర్యాలీలు తీశారు.
గిల్లెన్ ఆచూకీ చెప్పిన వారికి ఆర్మీ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కమాండ్(సీఐడీ) రివార్డును 25 వేల డాలర్లుగా ప్రకటించింది. గిల్లెన్ ఆచూకీ కనుగొనడానికి కట్టుబడి ఉన్నాము. మా దగ్గరున్న ప్రతి చిన్న సమచారాన్ని వదలకుండా దర్యాప్తు చేస్తున్నాము. గిల్లెన్ ఆచూకీ లభించేవరకు మా ప్రయత్నాలను ఆపము అని ఆర్మీ సీఐడీ ప్రతినిధి క్రిస్ గ్రే ఓ ప్రకటనలో తెలిపారు. ఆమె చివరిసారిగా ఫిట్నెస్ దుస్తుల్లో ఉదారంగు ప్యాంటు, నలుపు రంగు టీషర్టు వేసుకుందని తెలిపారు. ఈ ఘటనలో అనుమానితులైన 150 మందిని ఇప్పటి వరకు ఇంటర్వ్యూ చేశారు. ఎఫ్బీఐతో పాటు మిగతా నేర పరిశోధన సంస్థలను సహాయం చేయమని అమెరికా ఆర్మీ కోరింది.













