900 మంది సైనికులకు కరోనా
అమెరికాలో త్రివిధ దళాలకు చెందిన 900 మంది సైనికులకు కరోనా పాజిటివ్ వచ్చింది. అమెరికా సైనికాధ్యక్షుడు జేమ్స్ మెక్‌కాన్‌విల్లే పెంటగాన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం రోజుకు 700 పరీక్షలు నిర్వహించే సామర్థ్యం తమకుందని తెలిపారు. సైన్యం భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. సైన్యం తన సైనికులకు శిక్షణ ఇవ్వడం కొనసాగిస్తుందన్నారు. భౌతిక దూరం పాటించడం, స్క్రీనింగ్, పరీక్షలు నిర్వహించడం ద్వారా సురక్షితమైన వాతావరణం వుండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. యుద్ధానికి సిద్ధంగా వుండేలా సైన్యాన్ని సన్నద్ధం చేయడం అవశ్యమని, అందువల్ల శిక్షణ తప్పదని అన్నారు. అత్యవసరం కాని శిక్షణలను రద్దు చేస్తునట్లు మార్చి 26న ప్రకటించారు.













