డీజేఐ కి అమెరికా షాక్
చైనా కంపెనీకి అమెరికా సైన్యం షాకిచ్చింది. సైబర్ ముప్పు పొంచి ఉందనే కారణంగా చైనాకు చెందిన డీజేఐ సంస్థ డ్రోన్లను వాడకూడదని అమెరికా సైన్యం నిర్ణయించింది. చైనా సంస్థ ఎస్జడ్ డీజేఐ టెక్నాలజీ కంపెనీకి చెందిన ఈ డ్రోన్ల వాడకాన్ని నిలిపివేయాలంటూ ఆ దేశ సైన్యాధికారులకు సృష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆగస్టు 2న రాసిన లేఖలో ఆ డ్రోన్ల వినియోగాన్ని నిలిపివేయండి. డీజేఐ అఫ్లికేషన్లను ఆన్ఇన్స్టాల్ చేసుకోండి. బ్యాటరీ, స్టోరేజ్ మీడియా తదితర విభాగాలను తొలగించండి. తమ ఆదేశానుసారం సురక్షితమైన పరికరాలను అమర్చుకోండి అని పేర్కొంది. ఇప్పటికే అమెరికా అధికమొత్తంలో ఈ కంపెనికి చెందిన పరకరాలను వాడుతున్నట్లు సదరు లేఖ పేర్కొంటోంది.













