పాక్‌తో అమెరికా భారీ ఒప్పందం
మెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సమావేశమైన కొద్ది రోజులకే ఇరు దేశాల మధ్య భారీ ఒప్పందానికి లైన్ క్లియర్ అయ్యింది. పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలకు ఉతమిచ్చేందుకు 125 మిలియన్ డాలర్ల విలువైన విదేశీ సైనిక అమ్మకాల ఒప్పందానికి అమెరికా పచ్చజెండా ఊపింది. ఈ మేరకు అమెరికా హోం శాఖ అధికారికంగా వెల్లడించింది. గతేడాది జనవరిలో పాకిస్థాన్‌కు భద్రతా సాయాన్ని నిలిపివేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్లీ రక్షణ ఒప్పందం చేసుకోవడం ఇదే తొలిసారి. ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన ఇమ్రాన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ శాంతి ప్రక్రియలో భాగంగా ఎఫ్-16 కార్యక్రమానికి సాంకేతిక సహాయ సేవలు కొనసాగించాలంటూ పాకిస్థాన్ విజ్ఞప్తి చేసిందనీ.. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్టు రక్షణ భద్రతా సహకార సంస్థ (డీఎస్‌సీఏ) ఓ ప్రకటనలో వెల్లడించింది.













