అమెరికా సంచలన ప్రకటన
2008 ముంబై ఉగ్రదాడికి పాల్పడిన నిందితుల ఆచూకి చెప్పిన వారికి అమెరికా భారీ నజరానాను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఉగ్రదాడిల్లో పాల్గొన్న వారు ఏ దేశంలోనైనా అరెస్టయినా, లేదా దోషిగా తేలినా వారి వివరాలు తెలియజేస్తే రూ.35 కోట్ల రూపాయల రివార్డు ఇవ్వనున్నట్లు పేర్కొంది. ముంబై పేలుళ్ల జరిగి పదేళ్లు పూర్తయిన సందర్భంగా అమెరికా ఈ ప్రకటన చేసింది. ముంబై ఉగ్రదాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోగా, వారిలో ఆరుగురు అమెరికన్లు కూడా ఉన్నారు. ముంబై ఉగ్రదాడిని ఘోర కలిగా అభివర్ణించిన అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, లష్కరే తోయిబా, జేషే మహ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలను నిలువరించేందుకు పాకిస్తాన్ చర్యలు చేపట్టాలని సృష్టం చేశారు.
ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులకు ఇంకా శిక్ష పడకపోవడంపై పాంపియో ఆందోళన వ్యక్తం చేశారు. ముంబై దాడితో సంబంధమున్న ఏడుగురు లష్కరే తోయిబా ఉగ్ర వాదులు బెయిల్‌పై బయటే ఉన్నట్లు చెప్పారు. వీరిలో ఆపరేషన్స్ కమాండ్ జకిర్ రెహ్మాన్ లక్వీ కూడా ఉన్నట్లు ట్రంప్ ప్రభుత్వం సృష్టం చేసింది. ఐక్యరాజ్యసమితి భద్రతా కౌన్సిల్ అభ్యంతరాలను పాకిస్తాన్ లాంటి దేశాలు సమర్థించి ఉగ్రవాదుల అటకట్టించాలని పాంపియో హెచ్చరించారు. ఇటీవల సింగపూర్ పర్యటన సందర్భంగా అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ నేపథ్యంలోనే ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.













