డిసెంబర్ నుంచి అమెరికా-ఇండియా మధ్య మరిన్ని నాన్-స్టాప్ ఫ్లైట్స్ సర్వీసెస్: యునైటెడ్ ఎయిర్‌లైన్స్
అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సంస్థ తమ గ్లోబల్ రూట్ నెట్‌వర్క్‌ను భారత్ మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య రెండు కొత్త నాన్‌స్టాప్ సేవలతో విస్తరించాలని యోచిస్తోంది. 2020 డిసెంబర్ నుండి, యునైటెడ్ ఎయిర్ లైన్స్ ప్రతిరోజూ న్యూఢిల్లీ -చికాగో మధ్య మరియు 2021 వేసవి కాలం నుండి బెంగళూరు మరియు సాన్ ఫ్రాన్సిస్కో మధ్య ప్రతిరోజూ తమ పాసింజర్ సర్వీస్ ను నడపడానికి ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఇది బెంగళూరు మరియు అమెరికా మధ్య మొట్టమొదటి నాన్-స్టాప్ సర్వీస్ అని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ తెలిపింది.
యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఇంటర్నేషనల్ సేల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మార్సెల్ ఫుచ్స్ మీడియా తో మాట్లాడుతూ న్యూఢిల్లీ – న్యూ యార్క్ , ముంబై – న్యూ యార్క్ మరియు న్యూ ఢిల్లీ – సాన్ ఫ్రాన్సిస్కో మధ్య యునైటెడ్ ఎయిర్‌లైన్స్ పాసింజర్ సర్వీస్ ఉన్నప్పటికీ ఇండియా నుంచి అమెరికా కు మరి ఏ ఇతర ఎయిర్‌లైన్స్ ఇవ్వని నాన్-స్టాప్ పాసింజర్ సర్వీస్ ను యునైటెడ్ ఎయిర్‌లైన్స్ అందించడానికి ముందుకు వచ్చినట్లు తెలిపారు.
ఈ కొత్త నాన్-స్టాప్ సర్వీస్ యునైటెడ్ ఎయిర్‌లైన్స్ అంతర్జాతీయ రూట్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడమే కాక ఇండియా నుండి యునైటెడ్ ఎయిర్‌లైన్స్ వినియోగదారులకు మరింత ఎక్కువ ప్రయాణ ఎంపికను అందిస్తుంది అని వివరించారు.













