BEA: కేంద్ర మంత్రి డా. చంద్రశేఖర్ పెమ్మసాని చేతులమీదుగా తెలుగు టైమ్స్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ పోస్టర్ విడుదల
అమెరికాలో గత 22 సంవత్సరాలుగా ప్రచురితమవుతున్న తెలుగు టైమ్స్ ఎడిటర్ & సీఈఓ సుబ్బారావు చెన్నూరి మాట్లాడుతూ 2003 లో San Francisco లో ప్రారంభమయిన తెలుగు పత్రిక తెలుగు టైమ్స్ ప్రస్తుతం అమెరికాలో తెలుగు వారికి ఒక ప్రింట్ పత్రిక, ఒక ఈ పేపర్, ఒక పోర్టల్ , ఒక యూట్యూబ్ ఛానల్ గానే కాకుండా ఒక మీడియా హౌస్ గా, తెలుగు కమ్యూనిటీ కి ఒక మీడియా కోఆర్డినేటర్ గా, ఒక ఈవెంట్ ఆర్గనైజర్ గా, తెలుగు రాష్ట్రాలకు ఒక వారధిగా అనేక సేవలు చేస్తూ అందరి మన్ననలుతో ముందుకు పోతోంది. 2023 నుంచి అమెరికాలోని తెలుగు వ్యాపార వేత్తలకు ఒక వేదిక ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యంతో తెలుగు టైమ్స్ బిజినెస్ ఎక్స్ లెన్స్ అవార్డ్స్(Bussiness Excellence Awards) ప్రారంభించి 2023 లో కాలిఫోర్నియా రాష్ట్రం లోని శాన్ హొసె లో, 2024 లో డల్లాస్ నగరంలో విజయవంతంగా నిర్వహించింది. ఇప్పుడు 3వ సంవత్సరం న్యూ యార్క్ నగరం లో మే 24 తేదిన చేయటానికి అన్ని ఏర్పాట్లు మొదలు పెట్టింది.
తెలుగు దేశం పార్టీ నాయకులు, కేంద్ర మంత్రి డా. చంద్ర శేఖర్ పెమ్మసాని తెలుగు టైమ్స్ ఎడిటర్ సుబ్బా రావ్ చెన్నూరి మరియు డైరెక్టర్ సీవీ రామ్ సుశాంత్ ల సమక్షంలో బిజినెస్ ఎక్స్ లెన్స్ అవార్డ్స్ 2025 పోస్టర్ ను విడుదల చేశారు. అలాగే ఈ అవార్డ్స్ కోసం తయారు చేసిన వెబ్ సైట్ : (businessawards.telugutimes.net ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డా. పెమ్మసాని మాట్లాడుతూ తెలుగు టైమ్స్ పత్రిక గత 22 సంవత్సరాలు గా అమెరికా లో తెలుగు కమ్యూనిటీ కి మీడియా పరం గానే కాక , అనేక విధాలుగా సేవ చేస్తోందని, గత రెండు సంవత్సరాలుగా తెలుగు ఎంట్రెప్రినుర్స్ కోసం బిజినెస్ అవార్డ్స్ ఇస్తోందని, ఇది అందరికీ ఎంతో ఉపయోగకరమైన విషయం అని అన్నారు. అనేక కేటగిరీలలో అవార్డ్స్ ఉన్నాయని, ఎంట్రెప్రెన్యూర్స్ అందరూ ఉత్సాహంగా పాల్గొనాలని సూచించారు.
తెలుగు టైమ్స్ ఎడిటర్ సుబ్బారావు చెన్నూరి మాట్లాడుతూ డా చంద్ర శేఖర్ పెమ్మసాని కేంద్ర మంత్రి మాత్రమే కాదని, ఆయన ఒక విజయవంతమైన ఎన్నారై తెలుగు ఎంట్రెప్రెన్యూర్ అని, తెలుగు టైమ్స్ బిజినెస్ ఎక్స్లెన్స్ అవార్డ్స్ 2025 ప్రక్రియ ను ఆయన ప్రారంభించడం చాలా అదృష్టం మరియు ఆనందకరమైన విషయం అని అన్నారు. ఈ అవార్డ్స్ ఫంక్షన్ ఈ సారి న్యూ యార్క్ సిటీ చేయాలని , శనివారం 24 మే 2025 వ తేదీన చేయాలని నిర్ణయించామని అన్నారు. ఈ ఈవెంట్ కి ఫెడరేషన్ అఫ్ ఇండియన్ అసోసియేషన్ ( FIA ) న్యూ యార్క్ ఆర్గనైజింగ్ పార్టనర్ గా ఉంటుందని, జాతీయ తెలుగు సంఘాలు తానా, ఆటా, నాట్స్, TTA , GTA లు కమ్యూనిటీ పార్టనర్స్ గా వ్యవహరిస్తామని అన్నారు. టీవీ 9- టీవీ 9 USA మీడియా పార్టనర్ గా ఉంటుందని తెలిపారు. 1 మార్చ్ 2025 నుంచి నామినేషన్స్ ను స్వీకరిస్తామని, వెబ్ సైట్ (businessawards.telugutimes.net) ద్వారా అన్ని వివరాలు పరిశీలించి నామినేషన్ లు వేయాలని అందరిని కోరుతున్నామని తెలిపారు.







