భారత్ లో అమెరికన్ బ్రాండ్
అమెరికా రాజధానిలోని బ్రాండెడ్ క్రీడా దుస్తుల తయారీ సంస్థ అండర్ ఆర్మర్ భారత్‌లో తమ శాఖా కార్యాలయం ద్వారా వాణిజ్యాన్ని ఆరంభిస్తున్నట్టు ప్రకటించింది. పూర్తి స్థాయి సొంత శాఖ ద్వారా ఈ కార్యకలాపాలను సాగిస్తామని అండర్ ఆర్మర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ తుషార్ గోకుల్దాస్ ఈ సందర్భంగా సృష్టం చేశారు. ప్రత్యేకించి భారత్‌లోని అథ్లెట్లకు తమ అండర్ ఆర్మర్ దుస్తులు, పాదరక్షలు, ఇతర ఆక్సెసరీస్ ఔన్నత్యాన్ని ఆస్వాదింపజేయాలని భావిస్తున్నామన్నారు. త్వరలో తమ కంపెనీ ప్రాంచైజీ భాగస్వామ్య స్థానిక రీటైల్ వ్యాపారుల ద్వారా, ఈకామర్స్ ద్వారా తమ కంపెనీ ఉత్పత్తులను భారత మార్కెట్లోకి ప్రవేశపెడతామన్నారు. వచ్చే కొన్ని వారాల్లోనే ఇక్కడ ఓ తొలి స్టార్‌ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కాగా గోకుల్ దాస్ గతంలో ఆదిదాస్, బోస్టన్, కన్సల్టింగ్ గ్రూప్, కోల్గేట్ పాల్మోలివ్, వర్ల్పూట్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో పనిచేశారు.













