ఐక్యరాజ్యసమితి ఉన్నతస్థాయి వేదికలో ఆంధ్రప్రదేశ్ వాణి
సుస్థిర అభివృద్ధిపైన ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక మండలి ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి రాజకీయ వేదిక (హెచ్ఎల్పీఎఫ్) వేదికలో ఆంధ్రప్రదేశ్ భాగస్వామి అయింది. ఈ నెల 10 నుంచి 12 వరకు ఈ కార్యక్రమం న్యూయార్క్లో జరిగింది. భారతదేశం నుంచి ఆంధ్రప్రదేశ్ ఒక్కటే ఈ వేదికలో పాల్గొంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రణాళికశాఖకు చెందిన అలెన్ జాన్ శామ్యూల్ సమావేశానికి హాజరయ్యారు. 44 దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఈ వేదికలో 2019 నాటికి సంతృప్త పద్ధతిలో సాధించనున్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వ్యూహాన్ని ఆయన వివరించారు.













