చర్చల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం
మధ్యవర్తిత్వం ద్వారానే కాశ్మీర్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఐరాస సెక్రెటరీ జనరల్ ఎ.గుటేరాస్ భారత్, పాక్ దేశాలను కోరారు. గతనెల 5న రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని పాక్ తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ సమాజం మద్దతును కూడగట్టుకునేందుకు ప్రయత్నించింది. ఐరాసలో ఫిర్యాదు చేసింది. అయితే, పాక్ ఫిర్యాధుపై ఐరాస స్పందించలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ వివాదాన్ని ఇరుదేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. తాజాగా, ఈ అంశంపై గుటేరాస్ మాట్లాడారు. కాశ్మీర్ వివాదం భారత్, పాక్ దేశాల ద్వైపాక్షిక అంశమని అన్నారు. చర్చల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.













