భారత్ చర్యలు భేష్- యూఎన్ చీఫ్
మహమ్మారి కోవిడ్-19పై పోరులో ఇతర దేశాలకు అండగా నిలుస్తున్న దేశాలకు సెల్యూట్ చేస్తున్నామని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అన్నారు. ప్రాణాంతక వైరస్ వ్యాప్తి కట్టడికై భారత్ వంటి దేశాలు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. కరోనా వైరస్ ప్రభావాన్ని తగ్గించడంలో సత్పలితాలు ఇస్తున్నట్లుగా భావిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను దాదాపు 55 దేశాలకు భారత్ ఎగుమతి చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా విజ •ంభిస్తున్న దేశీయ అవసరాల కోసం తొలుత ఈ మందుల సరఫరాపై నిషేధం విధించిన భారత్ మానవతా దృక్పథంతో ఆంక్షలను ఎత్తివేసింది. ఈ క్రమంలో అమెరికా, మాల్దీవులు, ఇజ్రాయెల్, మారిషస్, సేచెల్లీస్ తదితర దేశాలు ఇప్పటికే హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను దిగుమతి చేసుకున్నాయి













