బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ డిశ్చార్జి
కొవిడ్ బారిన పడ్డ బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ (55) దాదాపుగా కోలుకున్నారు. లండన్లోని సెయింట్ థామస్ ఆస్పత్రి నుంచి ఆయన ఆదివారం డిశ్చార్జి అయ్యారు. ఆస్పత్రిలో ఆయన మూడు రోజుల పాటు ఐసీయూలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రధాని పూర్తిగా కోలుకోవాల్సి ఉందని, ఇకపై ఆయన తన అధికారిక నివాసంలో ఉంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి విధులకు దూరంగా ఉంటారని చెప్పాయి. తనకు చికిత్స అందించిన వైద్యులు, సిబ్బందికి జాన్సన్ కృతజ్ఞతలు తెలిపారు. వారికి జీవితాంతం రుణపడి ఉంటానని పేర్కొన్నారు. బ్రిటన్లో కొవిడ్ మృతుల సంఖ్య తాజాగా 10 వేలు దాటింది.













