ఫ్యామిలీ వీసా ఉన్నవారికి గుడ్‌న్యూస్ చెప్పిన యూఏఈ
యూఏఈలో ఫ్యామిలీ వీసాతో నివసిస్తున్న మగవారికి అక్కడి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై ఫ్యామిలీ వీసా కలిగిన ఉన్న మగవారికి కూడా వర్క్ పర్మిట్లను జారీ చేయనున్నట్టు మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ నూతన నిబంధనలు అనేక కంపెనీలకు, అదే విధంగా అనేక కుటుంబాలకు లాభం చేకూరుస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు అనేక కంపెనీలు మగ వర్కర్ల కోసం బయట దేశాల వైపు చూసేయని, ఇప్పుడు ఈ నిబంధనతో స్థానికులకే ఉద్యోగ అవకాశం లభిస్తుందని మానవ వనరులశాఖ మంత్రి నాజర్ బిన్ థానీ అల్ హమ్లీ తెలిపారు. ఈ నిబంధనతో సగటు కుటుంబ ఆదాయం కూడా పెరుగుతుందని ఆయన అన్నారు.
రెండేళ్ల వర్క్ పర్మిట్‌కు గాను నైపుణ్యం కలిగిన వర్కర్లు 300 దిర్హామ్‌లు చెల్లించాల్సి ఉంటుది. ఇంతకు ముందు కంపెనీని బట్టి ఈ ఫీజు 300 దిర్హామ్‌ల నుంచి 5000 దిర్హామ్‌ల వరకు ఉండేది. జులై నెలలో ప్రభుత్వం ఈ ఫీజును 145 సర్వీసులలో 50 నుంచి 90 శాతానికి తగ్గించేసింది. కాగా, ఇప్పటి వరకు ఫ్యామిలీ వీసా కలిగిన ఉన్న అమ్మాయిలకు మాత్రమే యూఏఈ ప్రభుత్వం వర్క్ పర్మిట్‌ను జారీ చేస్తూ వచ్చింది.













