డొనాల్డ్ ట్రంప్ కు ట్విట్టర్ షాక్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ మరోసారి షాకిచ్చింది. ఆయనకు ప్రజా ప్రయోజన నోటీసులు జారీ చేసింది. వాషింగ్గన్ లో అటానమస్ జోన్ ను స్థాపించేందుకు ప్రయత్నిస్తే సీనియస్ ఫోర్స్‌ను రంగంలోకి దింపుతామని ట్రంప్ తాజాగా ట్వీట్ చేశారు. తాను అధ్యక్షుడిగా ఉన్నంత కాలం వాషింగ్టన్ లో అటానమస్ జోన్ అనేది ఉండబోదని చెప్పారు. నిరసనకారులు లూటింగ్ కు పాల్పడితే షూటింగ్ ఉంటుందని హెచ్చరించారు. ట్రంప్ చేసిన ఈ ట్వీట్ పై ట్విట్టర్ అభ్యంతరం తెలిపింది. తమ సంస్థ విధానాలను ఉల్లఘించారంటూ ప్రజా ప్రయోజనాల నోటీసును జారీ చేసింది. ట్రంప్ చేసిన ట్వీట్ ప్రజలకు హానీ కలిగించే విదంగా ఉందని పేర్కొంది. ట్వీట్ పై వార్నింగ్ లేబుల్ ఉంచింది. ట్విట్టర్ తీరును వైట్ హౌస్ తప్పుబట్టింది. శాంతిభద్రతలను ఎవరూ అతిక్రమించకుండా ఉంచేందుకే ట్రంప్ ఇలా ట్వీట్ చేశారని తెలిపింది.
అధ్యక్షుడి వ్యాఖ్యలను వినే హక్కు ప్రజలకు ఉందని, ఆ తర్వాత ఆయనపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎన్నికల్లో ప్రజలు నిర్ణయించుకుంటారని పేర్కొంది. ట్రంప్ ట్వీట్ పై ట్విట్టర్ చర్యలు తీసుకోవడం ఇది నాలుగోసారి. మరోవైపు ట్రంప్ స్టేట్మెంట్ను ఫేస్బుక్ మాత్ర తొలగించలేదు. తమ విధానాలను ట్రంప్ ఉల్లంఘించలేదని తెలిపింది.













