డొనాల్డ్ ట్రంప్ కు టర్కీ షాక్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కోపంతో టర్కీలోని యువత కొందరు తమ ఐఫోన్లను పగలగొడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుండడంతో ఇవి వైరల్‌గా మారుతున్నాయి. టర్కీపై ట్రంప్ సర్కార్ ఆంక్షలు పెంచడంతో పాటు ఉక్కుపై సుంకాలు పెంచుతున్న నేపథ్యంలో టర్కీ ప్రజలు అమెరికాపై ఆగ్రహంతో ఉన్నారు. దీంతో టర్కీ వాసులు అమెరికా వస్తువులను నాశనం చేస్తూ తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగా అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ యాపిల్ తయారు చేసే ఖరీదైన ఐఫోన్లను కూడా పగలగొట్టేస్తున్నారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌కు చాలా మది స్థానిక ప్రజలు మద్దతు నిలుస్తున్నారు. అమెరికా ఆంక్షలకు దీటుగా ఎర్డోగన్ అమెరికా నుంచి టర్కీకి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై సుంకాలు పెంచేశారు. దీంతో అధ్యక్షుడి నిర్ణయాన్ని పలువురు సమర్థిస్తున్నారు. పలువురు కోకాకోలా బాటిళ్లు, ఐఫోన్లు, తదితర అమెరికా వస్తువులను ధ్వంసం చేయడంతోపాటు డాలర్ నోట్లను చించేశారు. సంబంధిత వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హ్యాష్‌ట్యాగ్‌లు జత చేస్తున్నారు.













