హాజరుకాలేను… క్షమించండి
ప్రధాని మోదీ గారికి నమస్తే. అమెరికా పర్యటనకు హృదయపూర్వక ఆహ్వానం. అయితే హౌడీ మోదీ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నందుకు నన్ను క్షమించండి అని హిందూ మహిళా నేత, డెమొక్రటిక్ పార్టీ ప్రతినిధి తులసి గబ్బార్డ్ అన్నారు. ప్రస్తుతం డెమోక్రటిక్ పార్టీ సభ్యురాలైన తులసి గబ్బార్డ్ 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ప్రచార కార్యక్రమంలో బిజీగా ఉన్నానని అందుకే రాలేకపోతున్నాని ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. హౌడీ మోదీ ఈవెంట్ అమెరికాలోని ఇండియన్ అమెరికన్లను, హిందూ అమెరికన్లను ఒక చోటికి తెస్తుందని తులసి గబ్బార్డ్ అశాభావం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 22 హ్యూస్టన్ ఎన్ఆర్జీ స్టేడియంలో 50,000 మంది భారతీయులు వచ్చే ఈవెంట్కు భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా ప్రభుత్వ ఉన్నతస్థాయి అధికారులు, గవర్నర్లు, కాంగ్రెస్ సభ్యులు, మేయర్లు హాజరవుతున్నారు.













