అమెరికాలో టీటీడీ ఆధ్వర్యంలో వైభవంగా మలయప్ప స్వామి కళ్యాణోత్సవం
అమెరికాలోని సెయింట్ లూయిస్లోని ది హిందూ ఆలయంలో శ్రీవేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాలు టీటీడీ ఆధర్వర్యంలో వైభవంగా జరిగింది. అర్చకులు, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కలియుగ దైవం భక్తులకు మలయప్ప స్వామిగా దర్శనమిచ్చారు. పండితులు వైఖానస ఆగమం ప్రకారం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి కళ్యాణాన్ని జరిపించారు. ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షుడు వెంకట్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి కళ్యాణోత్సవాలను టీటీడీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తానాలో జరిగిన వేంకటేశ్వర స్వామి కళ్యాణానికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ దంపతులు, సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.













