TANA: తానా మహాసభల్లో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు ‘తెలుగు తేజం’ అవార్డు
తానా (TANA) 24వ మహాసభల్లో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్ బీఆర్ నాయుడు గారికి ‘తెలుగు తేజం’ అవార్డు అందించారు. బీఆర్ నాయుడు గారి తరఫున ప్రముఖ యాంకర్ ‘టీవీ5’ మూర్తి ఈ అవార్డు అందుకున్నారు. తానా బోర్డ్ చైర్మన్ నాగేంద్ర కొడాలి, ఫౌండేషన్ చైర్ శశికాంత్ వల్లేపల్లి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ నరేన్ కొడాలి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ శ్రీనివాస్ లావు, సెక్రటరీ రాజా కసుకుర్తి, ట్రెజరర్ భరత్, తానా ఈసీ మెంబర్స్, తానా మాజీ ప్రెసిడెంట్లు హనుమయ్య బండ్ల, తోటకూర ప్రసాద్, కోమటి జయరాం, అంజయ్య చౌదరి లావు, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ రవి పొట్లూరి, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ ఉదయ్ కుమార్, చైర్మన్ గంగాధర్ నాదెండ్ల, గారపాటి ప్రసాద్ తదితరులంతా కలిసి టీవీ5 మూర్తి గారిని సత్కరించారు. అద్భుతమైన మహామహులను సత్కరించిన తానా వేదికపై టీవీ5 చైర్మన్, పితృసమానులైన బీఆర్ నాయుడు గారి తరఫున ఈ అవార్డు అందుకోవడం చాలా గొప్ప అనుభూతి అని చెప్పారు. మహానుభావులు రామోజీరావు గతంలో ఇదే అవార్డు అందుకున్నారని, ఇప్పుడు మళ్లీ బీఆర్ నాయుడు ఈ అవార్డు అందుకోవడం చాలా గొప్ప విషయమని కొనియాడారు. అమరావతి కోసం పోరాడిన మహిళలకు మద్దతునిచ్చినందుకు బీఆర్ నాయుడు గారిపై, తనపై ‘రాజద్రోహం’ కేసు పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా మూర్తి గుర్తుచేశారు. ఈ అవార్డు అందించిన తానాకు కృతజ్ఞతలు తెలియజేశారు.







