TTA: డ్రగ్స్‌కు ‘నో’ చెప్పి, జీవితానికి ‘యస్’ చెప్పండి .. టీటీఏ చొరవకు అనూహ్య స్పందన
హైదరాబాద్: తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) ఆధ్వర్యంలో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేందుకు, యువతను మాదక ద్రవ్యాల నుంచి దూరం చేసేందుకు “సేవా డేస్” కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన “మైల్స్ ఆఫ్ హోప్” రన్‌కు నగరంలో అద్భుతమైన స్పందన లభించింది. 10కే, 5కే, 2కే కేటగిరీల్లో నిర్వహించిన ఈ రన్ ద్వారా “సే నో టు డ్రగ్స్, సే యస్ టు లైఫ్” అనే సందేశాన్ని టీటీఏ శక్తివంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది.
ప్రముఖుల ప్రశంసలు, టీటీఏ ప్రముఖుల భాగస్వామ్యం…
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైడ్రా కమీషనర్ ఎ. రంగనాథ్ గారు హాజరయ్యారు. ప్రముఖ నటుడు తరుణ్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. టీటీఏ నాయకత్వంలో కీలక ప్రముఖులు వేదికను అలంకరించారు. వారిలో.. టీటీఏ సలహా మండలి ఛైర్మన్ విజయ్ పాల్ రెడ్డి, టీటీఏ అధ్యక్షుడు నవీన్ మల్లిపెద్ది, జ్యోతి రెడ్డి దూదిపాల తదితరులు ఉన్నారు. డ్రగ్స్‌కి వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న టీటీఏ బృందాన్ని రంగనాథ్, నటుడు తరుణ్ అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రముఖులందరూ కలిసి రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లో ఆరోగ్య స్పృహను, సామాజిక బాధ్యతను పెంచేందుకు టీటీఏ చేస్తున్న కృషిని మరోసారి తెలియజేసింది.






