TTA: యోగాను జీవితంలో భాగం చేయడంపై టీటీఏ వెబినార్ సక్సెస్
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) హెల్త్ అండ్ వెల్‌నెస్ కమిటీ ఆధ్వర్యంలో ‘ఇంటిగ్రేటింగ్ ఆయుర్వేద అండ్ యోగ ఇన్‌టూ డైలీ లైఫ్’ కార్యక్రమం జరిగింది. టీటీఏ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది ఆధ్యర్యంలో ఈ ఆలోచనాత్మక వెబినార్ నిర్వహించారు. జూమ్ ద్వారా జరిగిన ఈ వెబినార్‌ను యూట్యూబ్‌లో కూడా పలువురు చూసి విజయవంతం చేశారని టీటీఏ తెలిపింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన శ్రీ యోగి నటరాజ్, శ్రీ అమిత్ షా తదితరులు తమ ఆలోచనలను, జ్ఞానాన్ని అందరితో పంచుకున్నారు.ఈ సెషన్‌ను డాక్టర్ లతా కాచీ, దీపిక రెడ్డి నల్ల ముందుండి నడిపించారు. ఈ క్రమంలో హెల్త్ అండ్ వెల్‌నెస్ అడ్వైజర్ శ్రీకాంత్ రెడ్డి గాలి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కవిత రెడ్డి, జనరల్ సెక్రటరీ శివా రెడ్డి కొల్లా, వెబ్ కమిటీ చైర్ నరేందర్ యారవ, మీడియా అండ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ దీపిక రెడ్డి నల్లా, మీడియా కో-చైర్ అనుదీప్ దిడ్డి తదితరులకు టీటీఏ ధన్యవాదాలు తెలిపింది. ఇలాంటి సెషన్లు ఎంతో విలువైనవని, సామాన్యుల జీవితాన్ని మెరుగు పరచుకోవడానికి అవసరమయ్యే జ్ఞానాన్ని అందజేస్తాయని టీటీఏ తెలిపింది. భవిష్యత్తులో తాము ఏర్పాటు చేసే వెబినార్లకు మరింత మంది హాజరవ్వాలని కోరింది.







