TTA: టీటీఏ ఆధ్వర్యంలో ఘనంగా టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) బే ఏరియా చాప్టర్ ఆధ్వర్యంలో జరిగిన టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. టీటీఏ బే ఏరియా లీడ్ (బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ మెంబర్‌షిప్స్ డైరెక్టర్) అమిత్ రెడ్డి సూరకంటి ఈ పోటీలను అద్భుతంగా ఆర్గనైజ్ చేశారు. 25 మంది ఆటగాళ్లు ఈ పోటీల్లో పాల్గొని సత్తా చాటారు. విజేతలకు ట్రోఫీ, మెడల్స్‌తోపాటు 700 డాలర్ల క్యాష్ ప్రైజ్ కూడా అందించారు. రన్నరప్‌లకు కూడా ట్రోఫీ, మెడల్స్‌తోపాటు 350 డాలర్ల నగదు బహుమతి అందిచారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ స్పాన్సర్లు స్టార్ టెక్నాలజీ, శాక్రోశాంక్టిన్ఫో సంస్థలు, బేఏరియా టీం కల్యాణ్, సాయి కల్యాణ్, జక్కిడి నాని రెడ్డి, వెంకట నాగరాజు, రాకేష్‌లకు టీటీఏ ధన్యవాదాలు తెలిపింది.







