TTA: టీటీఏ సియాటెల్ చాప్టర్ ఆధ్వర్యంలో వైభవంగా బతుకమ్మ సంబరాలు

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) సియాటెల్ చాప్టర్ ఆధ్ంర్యంలో నార్త్ క్రీక్ హై స్కూల్‌లో బతుకమ్మ (Bathukamma) సంబరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఈ వేడుకకు 5,000 మందికి పైగా హాజరుకావడం విశేషం. జ్యోతి ప్రజ్వలన, భక్తి గీతాలతో ప్రారంభమైన ఈ వేడుకల్లో మహిళలు అందంగా అలంకరించిన పూల బతుకమ్మలతో సాంప్రదాయ ఊరేగింపు నిర్వహించారు. ఈ వేడుకల్లో జానపద గీతాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, సాంప్రదాయ నృత్యాలు తెలంగాణ వారసత్వాన్ని చాటిచెప్పాయి.
ఈ (Bathukamma) కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సినీ నిర్మాత విశ్వ ప్రసాద్ గారు, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా-సియాటెల్ నుండి కాన్సుల్ సురేష్ కుమార్ శర్మ, మిస్ ఇండియా, నటి మానస వారణాసి హాజరయ్యారు. ఈ వేడుక విజయవంతం కావడానికి సహకరించిన టీటీఏ (TTA) నాయకత్వానికి, మద్దతుదారులకు సియాటెల్ టీటీఏ (TTA) చాప్టర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. నిరంతర మార్గదర్శకత్వం, ప్రోత్సాహం అందించిన వంశీ రెడ్డి కంచరకుంట్ల గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వ్యవస్థాపక అధ్యక్షుడు నవీన్ రెడ్డి మల్లిపెద్ది, వ్యవస్థాపకులు డా. పైళ్ల మల్లారెడ్డి, సలహా మండలి ఛైర్ డా. విజయపాల్ రెడ్డి గారు, కో-ఛైర్ డా. మోహన్ రెడ్డి పాతలోళ్ల, సలహా మండలి సభ్యులు భరత్ రెడ్డి మాదాడి, శ్రీనివాస్ అనుగు తదితరులకు కూడా టీటీఏ సియాటెల్ చాప్టర్ ధన్యవాదాలు తెలియజేసింది.
టీటీఏ (TTA) బోర్డ్ సభ్యులు గణేష్ మాధవ్ వీరమనేని, ప్రదీప్ మెట్టు, మనోహర్ బోడ్కే, అలాగే ప్రియాంక రెడ్డి అందించిన సహకారానికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ప్రాంతీయ ఉపాధ్యక్షులు (RVPs) – శ్యామ్, ప్రసాద్ సేనాపతి, లవ కుమార్ – కూడా ఈ బతుకమ్మ (Bathukamma) కార్యక్రమాన్ని అద్భుతమైన విజయవంతం చేయడంలో గణనీయమైన కృషి చేసినట్లు టీటీఏ సియాటెల్ చాప్టర్ తెలిపింది.