Bathukamma: అరిజోనాలో ఘనంగా టీటీఏ మెగా బతుకమ్మ, దసరా వేడుకలు

ఎన్నో వేల మైళ్ల దూరంలో ఉన్నా, అమెరికాలోని తెలుగువారి హృదయాన్ని బతుకమ్మ (Bathukamma) పండుగ స్పృశించింది. అరిజోనాలో తెలంగాణ తెలుగు అసోసియేషన్ (TTA) ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా బతుకమ్మ (Bathukamma), దసరా (Dasara) వేడుకలు సంస్కృతికి సజీవ సాక్ష్యంగా, సంప్రదాయాలపై అచంచల విశ్వాసానికి ప్రతీకగా నిలిచాయి. ఈ మహోత్సవంలో దాదాపు 3,500 మందికి పైగా తెలుగువారు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ బతుకమ్మ (Bathukamma) వేడుకలు విజయవంతం కావడం పట్ల నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. వేడుకలు విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ, సమాజ బంధాన్ని పెంపొందించే మరిన్ని అర్థవంతమైన కార్యక్రమాలను భవిష్యత్తులో నిర్వహిస్తామని టీటీఏ (TTA) ప్రకటించింది.
ఈ ఉత్సవంలో టీటీఏ (TTA) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యులైన జ్యోతి రెడ్డి దుడిపాల, ప్రవీణ్ సమల, స్టేట్ కోఆర్డినేటర్లు శ్రవణ్ కుమార్ గంప, వసంత సుమంత్, రామకృష్ణ నల్ల తదితరులు పాల్గొన్నారు. అలాగే టీటీఏ (TTA) రీజినల్ వైస్ ప్రెసిడెంట్స్ అనూప్ గోదిశాల, అవినాష్ రెడ్డి నండ్యాల, దినేష్ రెడ్డి సుడుల, వాసవి రెడ్డి లింగాల, వినోద్ గార్డస్, కోశాధికారులు పంకజ్ కుమార్ పడాల, ప్రదీప్ చందుపట్ల తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.