TTA: ఘనంగా ముగిసిన టీటీఏ హోలీ సంబరాలు
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) (TTA) ఆధ్వర్యంలో టంపా వేదికగా హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో తమకు మద్దతుగా నిలిచిన టీటీఏ ఫౌండర్ పైళ్ల మల్లారెడ్డి, టీటీఏ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది, ఏసీ, ఈసీ, బీవోడీ టీమ్స్‌కు టీటీఏ ధన్యవాదాలు తెలియజేసింది. టంపా టీం సభ్యులు దిలీప్ వాసా (బీవోడీ), రఘు అలుగుబెల్లి (బీవోడీ), అలాగే కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరపడం కోసం ఎంతో కృషి చేసిన ఆర్వీపీలు, ఆర్సీ సభ్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. అలాగే మహిళా సభ్యులు మౌనిక కులకర్ణి, పల్లవి యామ, పరినిధి, యశస్విని కృషిని కొనియాడింది. గోల్డ్ స్పాన్సర్లు డాక్టర్ నీరజ జాస్తి, ప్రవీణ్ గజ్జల, సుమన్ జెర్రిపోతుల, నూతన్, సందీప్ పాలవాయి, అలాగే సిల్వర్ స్పాన్సర్లు వేలన్, ప్రసాద్ మానెపల్లి, కుల్దీప్ గోయల్, ఫని మంగవల్లి, రూపేష్ యామ అండ్ ఫ్యామిలీ, క్రాంతి మేక అండ్ ఫ్యామిలీ, రాజేష్ రెడ్డి అండ్ ఫ్యామిలీ, సంతోష్ గూడూరు అండ్ ఫ్యామిలీ తదితరులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది. వీరితోపాటు తమకు అండగా నిలిచిన అయ్యప్ప ఆలయం ప్రెసిడెంట్ విజయ్ నారాయణ స్వామికి ప్రత్యేక అభినందనలు తెలిపింది.
టీటీఏ (TTA) కోర్ టీం, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు దిలీప్ వాసా, రఘు అలుగుబెల్లి, రీజనల్ వైస్ ప్రెసిడెంట్లు ప్రవీణ్ గజ్జల, క్రాంతి మేక, రాజేష్ యామసాని, రాజేష్ రెడ్డి, రీజనల్ కోఆర్డీనేటర్లు రూపేష్ యామ, మౌనిక కులకర్ణి, పృధ్వి అలుగుబెల్లి, ప్రణయ్ ముంగార తదితరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు టీటీఏ (TTA) పేర్కొంది.







