భదాద్రి కొత్తగూడెం జిల్లాలో టిటిఎ నిత్యావసర సరకుల పంపిణీ

తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ (టీటీఏ) ఆధ్వర్యంలో సంఘం వ్యవస్థాపకులు డా. పైళ్ల మల్లారెడ్డి, సంఘం అధ్యక్షులు మోహన్ పాటలోళ్ళ, అడ్వైజరీ కమిటీ ఆధ్వర్యంలో భదాద్రి కొత్తగూడెం జిల్లా మోదుగులగూడెం గ్రామంలో 60 మంది కరోనా బాదిత కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కరోనా మహమ్మారి రెండవ దశ విజృంభించి ప్రజల జీవన విధానాన్ని పూర్తిగా దెబ్బతీసిందని ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించి కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు రేగా కాంతారావు సూచన మేరకు తమ సంస్థ ప్రజలకు ఎంతో కొంత సహాయం అందించాలనే దృఢసంకల్పంతో ఇక్కడకు వచ్చి బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగిందని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. కార్యాక్రమంలో భదాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ అమెరికా తెలుగు సంఘం వాలంటీర్లు, కునారపు రాము, కొత్త దామోదర్ గౌడ్, తోగ్గూడెం ఉప సర్పంచ్ బుస్సి శ్రీనివాస్, ఆదివాసీ ఐక్యవేదిక మండల అధ్యక్షులు తోలెం శ్రీనివాస్, పినపాక మన్యం టీవీ విలేకరి దొడ్డి శ్రీనివాస్, టీఆర్‍ఎస్ నాయకులు కునారపు సత్యనారాయణ, ఉడుగుల రామచంద్రు, మోకాళ్ల వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముత్తాపురం సర్పంచ్ పూనెం సమ్మయ్య తమ గ్రామంలో బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన టిటిఎ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.