TTA: టీటీఏ షార్లట్ చాప్టర్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) అధ్యక్షుడు నవీన్ రెడ్డి మల్లిపెద్ది నాయకత్వంలో టీటీఏ షార్లట్ చాప్టర్ (TTA Charlotte Chapter) ఆధ్వర్యంలో బోనాలు, అలయ్-బలయ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో 2,000 మందికి పైగా పాల్గొని షార్లట్ తెలుగు కమ్యూనిటీ ఐక్యతను, సంస్కృతిని చాటి చెప్పారు. 2026 జులైలో జరగనున్న టీటీఏ మెగా కన్వెన్షన్ ఎంత విజయవంతం అవుతుందో ఈ బోనాలు కార్యక్రమం ఒక టీజర్‌లా చూపించిందనే చెప్పాలి. ఈ వేడుకలు విజయవంతం చేయడానికి టీటీఏ (TTA) వ్యవస్థాపకుడు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డితో పాటు ఇతర ముఖ్య లీడర్లకు ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. బోనాల వేడుకలను ముందుండి నడిపించిన కవిత గుందేటికి, ముఖ్య మద్దతుదారులైన అంకుష్ వీరారెడ్డి, వరుణ్ రెడ్డి తుమ్మలపల్లి, అనుషా అంకాతి, నవ్య రెడ్డి కర్నాటిలకు టీటీఏ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది.
ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు కృషి చేసిన ఆర్గనైజింగ్ బృందం సభ్యులు నరేన్ దేవరపల్లి, మహేష్ గుందేటి, పల్లవి రెడ్డి రామిడి, శిరీష చింతకుంట, మహి వాసిరెడ్డి, మహాతి గోరస, నిఖిత రెడ్డి తుమ్మలపల్లి, రవి వాసిరెడ్డి, రమేష్ చింతకుంట, లక్ష్మీకాంత్ రామిడి, రమేష్ నక్క, దిలీప్ సాయసాని, హరి షట్గోపమ్, శ్రీనివాస్ బండారి, ప్రవీణ్ రెడ్డి, రాఘవేంద్ర చామలకు టీటీఏ ధన్యవాదాలు తెలిపింది. అలాగే ఈ వేడుకకు సహకరించిన ఈవెంట్ స్పాన్సర్లు, వార్షిక స్పాన్సర్లకు టీటీఏ షార్లట్ చాప్టర్ (TTA Charlotte Chapter) కృతజ్ఞతలు తెలియజేసింది.