TTA: టీటీఏ షార్లట్ చాప్టర్ ఆధ్వర్యంలో విజయవంతంగా రక్తదాన శిబిరం
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ షార్లట్ చాప్టర్ (TTA Charlotte Chapter) అధ్యక్షుడు నవీన్ రెడ్డి మల్లిపెద్ది నాయకత్వంలో రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసిన దిలీప్ రెడ్డికి టీటీఏ ప్రత్యేక అభినందనలు తెలియజేసింది. ఈ కార్యక్రమంలో 30 మందికి పైగా పాల్గొనగా, 25 మంది రక్తదానం చేశారు. ఈ డ్రైవ్‌ను స్పాన్సర్ చేసిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సభ్యులు అభిలాష్ ముదిరెడ్డికి, వేదికను అందించిన గోదావరి రెస్టారెంట్‌కు కూడా టీటీఏ (TTA Charlotte Chapter) ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన టీటీఏ షార్లట్ ఆర్గనైజింగ్ బృందం సభ్యులు పల్లవి రామిడి, రమేష్ చింతకుంట, లక్ష్మీకాంత్ రామిడి, ఆహ్లాద్ రెడ్డి, దీప్తి మిర్యాల, ప్రవీణ్ రెడ్డి, అరవింద్ ఉత్తిరామెరూర్‌తో పాటు వాలంటీర్లందరికీ కృతజ్ఞతలు తెలిపింది. ఇలాంటి సామాజిక కార్యక్రమాలు మరిన్ని చేపడతామని టీటీఏ షార్లట్ చాప్టర్ తెలిపింది.







