TTA: సీటెల్ లో ఘనంగా టిటిఎ బోనాల వేడుకలు
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) సీటెల్ ఛాప్టర్ ఆధ్వర్యంలో బోనాలు, అలయ్ బలయ్ వేడుకలు ఘనంగా జరిగాయి. బెల్లెవూలోని విల్‌బర్టర్ హిల్ పార్క్ వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో 800 మందికిపైగా తెలుగు వారు పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా తమకు ఎంతో మద్దతుగా నిలిచిన టీటీఏ మాజీ అధ్యక్షులు వంశీ రెడ్డి కంచరకుంట గారికి టీటీఏ సియాటెల్ ఛాప్టర్ నాయకులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈవెంట్ నిర్వహించడంలో కీలకపాత్ర పోషించిన గణేష్ మాధవ్ వీరమనేని, మనోహర్ బోడ్కే, ప్రదీప్ మెట్టుతోపాటు కార్యక్రమాన్ని అద్భుతంగా ప్లాన్ చేసిన ప్రియాంక కృష్ణకు కూడా సియాటెల్ ఛాప్టర్ కృతజ్ఞతలు తెలిపింది. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన ప్రసాద్ సేనాపతి, లవకుమార్ రేపాల, శ్యామ్‌తోపాటు తమకు మద్దతుగా నిలిచిన కమ్యూనిటీ లీడర్లకు కూడా సియాటెల్ ఛాప్టర్ అభినందనలు తెలియజేసింది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ఎత్తిచూపిన ఈ కార్యక్రమంలో వాలంటీర్లుగా సేవలందించిన వారిని కూడా టీటీఏ సియాటెల్ అభినందించింది.







