TTA: టీటీఏ గ్రేటర్ ఫిలడెల్ఫియా చాప్టర్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల ఉత్సవాలు

డెలావేర్‌లోని మహాలక్ష్మి దేవాలయంలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) గ్రేటర్ ఫిలడెల్ఫియా చాప్టర్ ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు 1,350 మందికి పైగా భక్తులు హాజరయ్యారు. ఈ వేడుక విజయవంతం కావడానికి కృషి చేసిన గ్రేటర్ ఫిలడెల్ఫియా కోర్ టీమ్‌లోని డాక్టర్ నరసింహారెడ్డి దొంతిరెడ్డి, ప్రదీప్ కాయిదాపురం, ప్రమోద్ చెవ్వ, సుశాంత్ గోపిరెడ్డి, రఘు అలుగుబెల్లి, భాస్కర్ పిన్న, సురేష్ వెంకన్నగారి, వినయ్ కందుల, అనుదీప్ దిడ్డి, సాయి సుప్రాజ్, వినయ్ మెరెడ్డి, రవీందర్ గాట్ల, కిరణ్ గుడూరు, సందీప్ కుందరపు తదితరులకు టీటీఏ (TTA) ధన్యవాదాలు తెలిపింది.
ఈ వేడుకకు మద్దతు తెలిపిన టీటీఏ (TTA) వ్యవస్థాపకుడు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి, ఏసీ ఛైర్మన్ డాక్టర్ విజయపాల్ రెడ్డి, ఏసీ కో-ఛైర్మన్ డాక్టర్ మోహన్ పాతోళ్ళ, సభ్యులు భరత్ మాదడి, శ్రీని అనుగులకు టీటీఏ టీం కృతజ్ఞతలు తెలిపింది. టీటీఏ అధ్యక్షుడు నవీన్ రెడ్డి మల్లిపెద్దికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. లాగే ఈ వేడుక జరిగిన వేదికను అందంగా అలంకరించిన తేజు డెకర్స్ (తేజు శంకర్), అమ్మవారిని అలంకరించిన శ్వేత పిన్న, ఆదిత్య, వారి బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. పోతరాజు వేషధారణతో ఉత్సాహపరిచిన రఘు వీసంను ప్రత్యేకంగా ప్రశంసించారు.
భోజన ఏర్పాట్లు పర్యవేక్షించిన డాక్టర్ నరసింహారెడ్డి దొంతిరెడ్డితో పాటు సాయిరామ్, ధీనా, శ్రీమంత్, రవివర్మ, శ్రీధర్లకు టీటీఏ (TTA) టీమ్ కృతజ్ఞతలు తెలిపింది. ఫోటోగ్రఫీ, ఫుడ్ కోఆర్డినేషన్ చేసిన సుశాంత్ గోపిరెడ్డికి, అందమైన తొట్టెలను తయారుచేసిన పృధ్వీరాజ్‌కు కూడా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి అండగా నిలిచిన స్పాన్సర్లు, సంస్థలు, మీడియా, మహా లక్ష్మి ఆలయ సిబ్బందికి టీటీఏ (TTA) గ్రేటర్ ఫిలడెల్ఫియా చాప్టర్ కృతజ్ఞతలు తెలియజేసింది.