టీటీఏ ఆధ్వర్యంలో అమెరికా వ్యాప్తంగా బోనాలు, అలయ్ బలయ్ వేడుకలు

తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో అమెరికాలోని పలు ప్రధాన నగరాల్లో బోనాలు, అలయ్ బలయ్ వేడుకలు నిర్వహించనున్నారు. అమెరికా వ్యాప్తంగా ఉన్న తెలుగు కమ్యూనిటీ అంతా ఈ వేడుకల్లో పాల్గొనేలా చేసి అందరినీ ఏకం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశ్యం. జులై 14న టంపాలో జరిగిన ఈ వేడుకలు.. జులై 27న న్యూజెర్సీలో, జులై 28న న్యూయార్క్ లో, జులై 28న డెలవేర్/ఫిలడెల్ఫియాలో, ఆగస్టు 4న ఇండియానాపోలిస్ లో, ఆగస్టు 11న సియాటెల్ లో, ఆగస్ట్ 18న షార్లట్ లో ఈ వేడుకలు జరగనున్నాయి. తెలుగు వారంతా ఈ వేడుకల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీటీఏ కోరుకుంటోంది.