డెట్రాయిట్ లో సమావేశమైన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టిటిఎ) బోర్డు సభ్యులు..
అమెరికాలో మొట్టమొదటి మరియు ఏకైక తెలంగాణా జాతీయ తెలుగు సంఘం తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టిటిఎ) బోర్డు సభ్యులతో డెట్రాయిట్ లోని మారియట్ రినైస్సెన్సు హోటల్ లో కార్యవర్గ మరియు బోర్డు సభ్యులతో సమావేశమైంది. రెండు పూటలుగ జరిగే ఈ సంవత్సరపు బోర్డు సమావేశాన్ని తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టిటిఎ) అధ్యక్షులు డా” మోహన్ రెడ్డి పట్లోళ్ల ప్రారంభించారు. మొదటి పూటలో అడ్వైజరీ కౌన్సిల్, కార్యవర్గ సభ్యులు, బోర్డు అఫ్ డైరెక్టర్ల రిమార్క్స్ తో పాటు టిటిఎ విధివిధానాల అంశాలు. నూతనంగా ఎన్నికైన బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం మరియు రెండవ పూటలో 2022 లో జరగబోయే తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టిటిఎ) మెగా కన్వెన్షన్ గురించి ముఖ్యమైన చర్చా కార్యక్రమాలు నిర్వహించారు.
మొదటగా, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టిటిఎ) ఫౌండర్ డా’ పైళ్ల మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రెసిడెంట్ డా’ మోహన్ తన కార్యవర్గం తో ఎన్నో వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నారని, అందరితో కలుపుకుని పోతు ప్రతి ఒక్కరితో గొప్పగా పని చేయిస్తున్నారని మోహన్ పనితీరును కొనియాడారు. డా’ మల్లారెడ్డి గారు తనదైన శైలిలో కార్యవర్గానికి సూచనలు అందించారు. ముఖ్యంగా కొత్త నాయకులను ప్రతి రాష్ట్రంలో గుర్తించి తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టిటిఎ) లో చేరేలా ప్రోత్సహించాలని అంతే కాకుండా ప్రతి రాష్ట్రంలోని తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టిటిఎ) కార్యవర్గం కనీసం 500 మంది సభ్యులను చేర్చాలని సూచించారు. తన వంతుగా కేవలం వారం రోజుల్లోనే షుమారు రెండు వందల కుటుంబాలను న్యూ యార్క్ నగరం నుండి చేరుస్తానని అందరిని ఉతేజ పరిచారు. పూర్వపు అధ్యక్షులు భరత్ మదాడిని మల్లారెడ్డి కొనియాడారు. కరోనా కాలంలో సైతం లెక్క చేయకుండా కమ్యూనిటీ కి పనికొచ్చే పనులు చేసారని అన్నారు. తదుపరి, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టిటిఎ) అడ్వైసరీ హెయిర్ డా’ విజయ్ పాల్ రెడ్డి మాట్లాడుతూ గడిచిన ఏడు నెలల్లో ప్రెసిడెంట్ మోహన్ చేసిన వివిధ అంశాలను ప్రస్తావిస్తూ, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టిటిఎ) ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుందని కొనియాడారు. ఇంతే దూకుడుగా వచ్చే ఏడాది రాబోతున్న 2022 న్యూజర్సీ మెగా కన్వెన్షన్ ను మహా గొప్పగా చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టిటిఎ) అడ్వైసరీ కో చైర్, డా’ హరనాథ్ పొలిచెర్ల మాట్లాడుతూ తాను అధ్యక్షులుగా ఉన్నపుడు చాలా గొప్ప కార్యక్రమాలు చేశామని, తన హయాం లో జరిగిన మెగా కన్వెన్షన్ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టిటిఎ) చరిత్రలో ఒక గొప్ప కలికితురాయి అని అంతే రీతిలో రాబోయే న్యూ జెర్సీ కన్వెన్షన్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టిటిఎ) అధ్యక్షులు డా’ మోహన్ రెడ్డి పట్లోళ్ల మాట్లాడుతూ తన కార్యవర్గం ఎంతో గొప్పగా పని చేస్తుందని ప్రతి ఒక్కరు పనిలో ముందుండి కొత్త కొత్త ఆలోచనలతో వినూత్న అంశాలతో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టిటిఎ) కు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ ఏడు నెలల్లో చేసిన మరియు ఇక ముందు చేయబోతున్న వివిధ సేవా మరియు సాంస్కృతిక కార్యక్రమాలను బోర్డు సభ్యులకు వివరించారు. న్యూజెర్సీ లో జరగబోయే 2022 మెగా కన్వెన్షన్ న భూతొ న భవిష్యత్ లాగ ఉండబోతుందని దీనికి ప్రతి ఒక్కరు సంసిద్ధంగా ఉండాలని కోరారు. తదుపరి ప్రెసిడెంట్ ఎలెక్ట్ వంశీ రెడ్డి మాట్లాడుతూ కరోనా సమయంలో దూరంగా ఉన్న మనం ఇలా అందరిని కలుసుకోవటం చాలా ఆనందము గా ఉందని అందరం కలిసి పనిచేయాలని అన్నారు.
తదనంతరం మూడు రాష్ట్రాల నుండి నూతనంగా ఎన్నికైన బోర్డు అఫ్ డైరెక్టర్లు గోవర్ధన్ రెడ్డి తోకల (వాషింగ్టన్ డి.సి.), దివాకర్ జంధ్యం (బోస్టన్), నంద దేవి శ్రీరామ మరియు ప్రసాద్ ఉప్పలపు (బే ఏరియా) లు ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. మొదటి పూట చివరిలో టిటిఎ ప్రతిష్టాత్మకంగా ఇస్తున్న ఉత్తమ టిటిఎ రీజినల్ వైస్ ప్రెసిడెంట్ అవార్డును ఈ సంవత్సరం న్యూ జెర్సీ ఆర్వీపి నరసింహ పెరుకకు అందచేశారు.
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టిటిఎ) రెండవ పూట కార్యవర్గ సమావేశం వచ్చే ఏడాది న్యూ జెర్సీ లో జరుగబోయే కన్వెన్షన్ సమావేశాల గురించి చర్చించారు. ముందుగా సమావేశాలకు అయ్యే ఖర్చులు ఇచ్చే దాతలు ముందు రావాలని కోరగా కేవలం అరగంటలో షుమారు అయిదు లక్షల డాలర్లు విరాళాలుగా ప్రకటించారు. ఇందులో ప్రముఖంగా డా’ పైళ్ల మల్లారెడ్డి స్వయంగా లక్ష డాలర్లు భూరి విరాళంగా ప్రకటించారు. దాతలు భూరి విరాళాలు ప్రకటించినందుకు అధ్యక్షులు మోహన్ రెడ్డి (కన్వెన్షన్ చైర్మన్), వంశీ రెడ్డి (కన్వెన్షన్ వైస్ చైర్మన్) మరియు శ్రీనివాస్ గన్గొని (కన్వీనర్) ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తదుపరి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సురేష్ రెడ్డి వెంకన్నగారి, ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ వెంకట్ గడ్డం, కోశాధికారి పవన్ రవ్వ వారి వారి కార్యకలాపాలు బోర్డు సభ్యులకు వివరించారు. కరోనా సమయం లో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ కమ్యూనిటీ సర్వీసెస్ చేసిన పని తీరు అందరిని ఆకట్టుకుంది. ఇందుకు కమ్యూనిటీ సర్వీసెస్ చైర్ శివ రెడ్డి కొల్ల అందరికి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం అందరికి అందుబాటులో ఉండే టిటిఎ మొబైల్ యాప్ ను ప్రసాద్ కునారపు టీం తయారుచేయగా అడ్వైసర్య్ కమిటీ సమక్షంలో లాంఛనంగా ప్రారంభించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన బోర్డు సమావేశాలను జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ మనప్రగడ నిరాటంకంగా నిర్వహించారు.
ఇక శనివారం రాత్రి ఆతిధ్య పాత్ర వహించిన డెట్రాయిట్ టీం సభ్యులు డా’ హరినాథ్ పొలిచెర్ల, వెంకట్ ఎక్క, దీప్తి మిర్యాల, భరత్ జెల్ల చక్కటి విందు వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. స్థానికంగా పాల్గొన్న వినోద కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. తెలంగాణ సంస్కృతిని ప్రతిభింభించే బోనాలు బతుకమ్మలతో అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు. ఈ సమయంలో విడుదల చేసిన టిటిఎ పాట సంగీత ప్రియులను అలరించింది. ఈ కార్యక్రమంలో పూర్వపు ప్రెసిడెంట్లను సత్కరించారు. చివరగా కరోనా సమయంలో నిరంతరం సేవలందించి షుమారు రెండు వందల మంది ప్రాణాలు కాపాడిన కరోనా టాస్క్ ఫోర్స్ టీం సభ్యులను ఘనంగా సత్కరించారు. ఆధ్యంతం వేడుకగా జరిగిన ఈ కార్యక్రంమంలో డా’ పైళ్ల మల్లారెడ్డి, డా’ విజయపాల్ రెడ్డి, డా’ హరనాథ్ పొలిచెర్ల, డా’ మోహన్ రెడ్డి పట్లోళ్ల, భరత్ మాదాడి, వంశీ రెడ్డి, సురేష్ వెంకన్నగారి, శ్రీనివాస్ మానాప్రగడ, కవిత రెడ్డి, వెంకట్ గడ్డం,పవన్ రవ్వ, హరిందర్ తాళ్లపల్లి, వెంకట్ ఎక్క, నవీన్ గోలి, డా’ నరసింహ రెడ్డి దొంతిరెడ్డి , మాధవి సోలేటి, అనిల్ ఎర్రబెల్లి, రాంరెడ్డి మల్లాది తదితరులు పాల్గొన్నారు.













