TTA: టాంపాలో ఘనంగా టిటిఎ బతుకమ్మ వేడుకలు

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) టాంపా చాప్టర్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 21వ తేదీన జరిగిన బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగింది. 3వ వార్షిక బతుకమ్మ వేడుకకు దాదాపు 1,800 మందికి పైగా హాజరు కావడం, ఇప్పటివరకు జరిగిన వాటిల్లో ఇదే అత్యధికంగా నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ అద్భుతమైన వేడుక తెలంగాణ యొక్క ఐక్యత, భక్తి, మరియు గొప్ప సంస్కృతిని టాంపా గడ్డపై ప్రదర్శించింది. టీటీఏ వ్యవస్థాపకులు డా. పైళ్ళ మల్లారెడ్డి ఆశీస్సులతో, డా. విజయపాల్ రెడ్డి (అడ్వైజరీ చైర్), డా. మోహన్ రెడ్డి పాటలోళ్ల (అడ్వైజరీ కో-చైర్), భరత్ రెడ్డి మాదాడి, శ్రీని అనుగు (అడ్వైజరీ మెంబర్స్), నవీన్ మలిపెద్ది (అధ్యక్షుడు), వంశీ రెడ్డి కంచరకుంట్ల (మాజీ అధ్యక్షుడు), శివ రెడ్డి కొల్లా (జనరల్ సెక్రటరీ) మార్గదర్శనంలో ఈ ఏడాది అమెరికా వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. టాంపాలో జరిగిన వేడుకల్లో కూడా వేలాది మంది ఎన్నారైలు పాల్గొని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.
టిటిఎ బోర్డ్ డైరెక్టర్లు దిలీప్ వాస, రఘు ఆలుగూబల్లి, రీజినల్ వైస్ ప్రెసిడెంట్స్ రాజేష్ యామ్సాని, ప్రవీణ్ గజ్జల, రాజేష్ రెడ్డి, క్రాంతి మేక, రీజినల్ కోఆర్డినేటర్స్ మోనికా కులకర్ణి, రూపేష్ యామ, పృధ్వి ఆలుగూబల్లి, ప్రణయ్ ముంగర ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకోసం జూలై 25, 2025 నుండి నెలల తరబడి చేసిన ప్రణాళికలు చివరకు ఒక మరుపురాని వేడుక రూపంలో కార్యరూపం దాల్చాయి. ఈ ఉత్సవం అయ్యప్ప పాడి వద్ద దుర్గా మాత పూజతో ప్రారంభమైంది. ఆ తర్వాత పాటలు, నృత్యాలు మరియు డా. భిక్షు నాయక్ గారి అద్భుతమైన జానపద ప్రదర్శనతో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఎంసి శారద మాంగిపూడి పర్యవేక్షణలో సాంప్రదాయ బతుకమ్మ ఆటపాటలు, కోలాటం సాయంత్రం వేళ ఆనందోత్సాహాలతో నింపాయి. రుచితా యామ్సాని ప్రత్యేక కొరియోగ్రఫీ, డిజె నిక్ అందించిన సంగీతం ప్రేక్షకులలో ఉత్సాహాన్ని నింపాయి. అలాగే, రాఫెల్స్ ద్వారా సరదా వాతావరణం కొనసాగింది. దోస్తు చౌరస్తా సహకారంతో, 1,800 మందికి విందు భోజనం అందించారు. విజయవంతమైన సభ్యత్వ నమోదు ఈ వేడుకను ఐక్యత, సంస్కృతి, మరియు కమ్యూనిటీ స్ఫూర్తికి గొప్ప నిదర్శనంగా నిలిపింది.
ఈ వేడుకల విజయవంతానికి సహకరించిన స్పాన్సర్లకు, వలంటీర్లకు టిటిఎ పెద్దలకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేశారు.