TTA: హైదరాబాద్ లో డిసెంబర్ 25వ తేదీన టిటిఎ దశమవార్షికోత్సవ వేడుకలు…
అమెరికాలో తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు ప్రతిబింబించే కార్యక్రమాలను నిర్వహిస్తూ, మరోవైపు తెలంగాణ కమ్యూనిటీని ఒకే వేదికపై తీసుకురావడంలో కృషి చేసిన తెలంగాణ అమెరికన్ తెలుగుఅసోసియేషన్ (TTA) తన దశమ వార్షికోత్సవాన్ని తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో భారీ ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ 25వ తేదీన హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఉన్న శిల్పకళా వేదికలో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. దశమ వార్షికోత్సవ వేడుకల నిర్వహణకోసం కమిటీని కూడా ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్ గా డాక్టర్ నరసింహారెడ్డి దొంతిరెడ్డిని, కో చైర్ గా అప్పిరెడ్డిని నియమించింది. ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మల్లిపెద్దితోపాటు, మాజీ అధ్యక్షుడు వంశీరెడ్డి కంచరకుంట్ల, సేవా డేస్ కో ఆర్డినేటర్ విశ్వకంది, అడ్వయిజర్ లుగా డాక్టర్ ద్వారకనాథ్ రెడ్డి, నరసింహ పెరుక, జ్యోతిరెడ్డి దూదిపాల, కవితా రెడ్డి లు కూడా ఈ కమిటీలో ఉన్నారు. కల్చరల్ కమిటీ చైర్ గా వాణి గడ్డం, అడ్వయిజర్ గా రమ వనమ, హాస్పిటాలిటీ కమిటీ చైర్ గా పల్లవిరెడ్డి రామిడి, అడ్వయిజర్ గా జ్యోతిరెడ్డి దూదిపాల, అవార్డు కమిటీ చైర్ గా సంగీతా రెడ్డి, అడ్వయిజర్ గా శివారెడ్డి కొల్ల, ఫైనాన్స్ కమిటీ చైర్ గా సహోదర్ పెద్ది రెడ్డి, అడ్వయిజర్ గా స్వాతి చెన్నూరి, లిటరరీ, సావనీర్ కమిటీ చైర్ గా శ్రీనివాస్ గూడూరు, సుధాకర్ ఉప్పల, మీడియా కమ్యూనికేషన్స్ కమిటీ చైర్ గా దీపికా రెడ్డి నల్ల, అడ్వయిజర్ గా గణేశ్ వీరమనేని ఉన్నారు. వెన్యూ కమిటీ చైర్ గా రఘు అలుగుబెల్లి వ్యవహరిస్తున్నారు.
టిటిఎ అడ్వయిజరీ కమిటీ నాయకులు వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ళ మల్లారెడ్డి, చైర్ డాక్టర్ విజయపాల్ రెడ్డి, కో చైర్ డా. మోహన్ రెడ్డి పాటలోళ్ళ, సభ్యులు భరత్ రెడ్డి మందాడి, శ్రీని అనుగుతోపాటు ఇసి కమిటీ నాయకుల పర్యవేక్షణలో ఈ వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు.
ఈ వేడుకలను పురస్కరించుకుని వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు. వివిధరంగాల్లో సేవలందించిన ప్రముఖులకు అవార్డులను అందజేయనున్నారు. రాజకీయ చర్చలు, ఇతర కార్యక్రమాలతోపాటు సంగీత విభావరులతో అందరినీ ఆకట్టుకోనున్నారు.
అందరూ రండి…నరసింహారెడ్డి దొంతిరెడ్డి
ఈ సందర్భంగా డాక్టర్ దొంతిరెడ్డి లక్ష్మీ నరసింహారెడ్డి మాట్లాడుతూ, ఈ దశమవార్షికోత్సవాలను పెద్దఎత్తున నిర్వహిస్తున్నామని, ఇందుకోసం తమ కమిటీ నాయకులతోపాటు, టీటీఎ పెద్దలు, ఎగ్జిక్యూటివ్కమిటీ సభ్యులు, బోర్డ్ డైరెక్టర్లు, రీజనల్ వైస్ ప్రెసిడెంట్లు, 2 పందల మందికి పైగా సభ్యులు భారత దేశంలో సేవా కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు వార్షికోత్సవాలను పెద్దఎత్తున జరిపేందుకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు స్వదేశంతో పాటు అమెరికాలో చేపట్టిన సేవాకార్యక్రమాల వివరాలను ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు. ఈ వేడుకలకు పలువురు రాజకీయ నాయకులు, సాహితీవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు, సినీమా కళాకారులు, సంగీత దర్శకులు, నేపథ్యసినీ గాయనీ గాయకులు వస్తున్నారని చెప్పారు. ఈ వేడుకలకు అందరూ వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరారు.






