ఇద్దరు ఒప్పుకుంటే ఆ సమస్య పరిష్కారం : ట్రంప్
ప్రధాని నరేంద్ర మోదీతో వేదికను పంచుకున్న గంటల వ్యవధిలోనే పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమ్ము కాశ్మీర్ వివాదాన్ని పరిష్కరించే సత్తా తనకు ఉందని, మధ్యవర్తిత్వానికి తాను సిద్ధమని మరోసారి వ్యాఖ్యానించారు. ఇమ్రాన్‌తో భేటీకి ముందు మీడియా ప్రతినిధులతో ట్రంప్ మాట్లాడుతూ నేను పాకిస్థాన్‌ను నమ్ముతున్నా, కాశ్మీర్లో ప్రతి ఒక్కరు సమానంగా బతకడాన్ని చూడాలనుకుంటున్నా. భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇద్దరు ఒప్పుకుంటే సమస్యను పరిష్కారిస్తా. ఈ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అని తెలిపారు.













