ఆ పార్టీ గెలిస్తే దేశంలో అరాచకమే : ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన ఉగ్రతను ప్రదర్శించారు. నవంబరులో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఓడిపోతే డెమెక్రటిక్ పార్టీవారు హింసకు పాల్పడతారని హెచ్చరించారు. ఇటీవల ఆయన వైట్‌హౌస్ అధికారులతో మాట్లాడారు. నవంబరులో జరిగే మధ్యంత ఎన్నికలో తమ పార్టీ గెలవాని ఒక వేళ డెమెక్రటిక్ పార్టీ గెలిస్తే దేశంలో హింసకు పాల్పడే అవకాశం ఉందని, నియంతృత్వధోరణి పెరిగిపోయే అవకాశం ఉందని ట్రంప్ పేర్కొన్నారు. ఇలా మాట్లాడడం ట్రంప్‌కు కొత్తేమీ కాదు.
2016లో అధ్యక్ష ఎన్నికలలో కూడా ఇదేవిధంగా ప్రచారం చేసారు. తనపార్టీ గెలవకపోతే దేశంలో అరచకాలు జరుగతాయని, అల్లరులకు తావు ఉందని చెప్పారు. ఇటీవల ఆయన మంత్రులు, పాస్టర్లతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ట్రంప్ అబార్షన్లు, మతస్వేచ్ఛ, యువత, నిరుద్యోగం వంటి అంశాలపై చర్చలు చేసినట్లు తెలుస్తున్నది. అయితే మీడియాకు మాత్రం ఈ విషయాలను చెప్పకుండా సువార్తను ప్రకటించే నాయకులు నవంబరులో జరిగే ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ గెలిచేలా చూడాలని కోరినట్లు చెప్పారు. ఈ ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ గెలవకపోతే మరో రెండేళ్లు విపత్కర పరిస్థితులను ఎదురుచూడాల్సి వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.













