నార్త్ కొరియాకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
పోలాండ్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఖండాంతర క్షిపణీ ప్రయోగించిన నార్త్ కొరియాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నార్త్ కొరియా చాలా ప్రమాదకరంగా వ్యవహరిస్తున్నదని అన్నారు. వాళ్ల ప్రవర్తన సిగ్గు చేటుగా ఉందని, దాన్ని అడ్డుకునేందుకు ఏదో ఒకటి చేయాలని అన్నారు. పోలాండ్ అధ్యక్షుడు ఆండ్రెజే డుడాతో కలిసి ప్రత్యేక మీడియా సమావేశంలో పాల్గొన్న ట్రంప్ ఈ వార్నింగ్ ఇచ్చారు. నార్త్ కొరియాపై సైనిక చర్యకు దిగుతారా అన్న ప్రశ్నకు బదులిస్తూ కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని అన్నారు.













