ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
2015లో చేసుకున్న అణు ఒప్పందంలోని అంశాలను ఇరాన్ అతిక్రమిస్తూ యురేనియం నిల్వలను పెంచుకోవాలని నిర్ణయించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అగ్గిమీద గుగ్గిలయయ్యారు. నిప్పుతో ఆడుకుంటున్నారని ఇరాన్‌ను హెచ్చరించారు. ఇరాన్ వ్యవహార శైలి ఇలాగే ఉంటే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని సృష్టం చేశారు. ఇరాన్‌తో చేసుకున్న అణు ఒప్పందం నుంచి అమెరికా గతేడాది బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే. తాము యురేనియం నిల్వలను పెంచుకున్నట్లు ఇరాన్ నుంచి ప్రకటన రాగానే అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో కూడా ఈ విషయంపై స్పందించి హెచ్చరికలు చేశారు. ఇరాన్ తమ అణు కార్యక్రమ చర్యలు కొనసాగిస్తున్నంత వరకు ఆర్థికపరమైన ఒత్తిడి, దౌత్యపరంగా ఒంటరి అవ్వడం వంటి పరిణామాలు తీవ్రతరం అవుతూనే ఉంటాయన్నారు.













