భారత్ కు ట్రంప్ పరోక్ష హెచ్చరికలు
వద్దని చెప్పినా వినకుండా రష్యా నుంచి ఎస్-400 క్షిపణులను కొనుగోలు చేసిన భారత్ దాని పర్యవసానాలను త్వరలోనే తెలుసుకుంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. బుధవారం ఆయన వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. మీరు ఊహించిన దానికంటే తొందరగానే భారత్‌కు ఆ విషయం తెలుస్తుంది అని మీడియా ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. ఇరాన్, ఉత్తరకొరియా, రష్యాలతో వాణిజ్య సంబంధాలు పెట్టుకునే దేశాలపై అమెరికా ఆంక్షలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. భారత్‌పై కూడా ఆయన ఎలాంటి వైఖరి అనుసరిస్తారన్న విషయం త్వరలోనే తేలనున్నది.













