చైనాకు ట్రంప్ హెచ్చరిక
వాణిజ్య చర్చల విషయంలో చైనా పప్పులు తన దగ్గర ఉడకవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సృష్టం చేశారు. వచ్చే ఏడాది జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల వరకు వేచి ఉండాలనుకుంటే చైనానే తీవ్రంగా నష్టపోతుందన్నారు. ఆ ఎన్నికల్లోనూ తనదే విజయమన్నారు. అప్పుడు చైనాతో జరిగే వాణిజ్య చర్చల్లో మరింత కఠినంగా ఉంటానని హెచ్చరించారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని చైనా బెట్టు వీడి ఈ లోగానే తమ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవాలని సూచించారు. రెండు దేశాల మధ్య చెలరేగిన వాణిజ్య యుద్ధానిన చల్లార్చేందుకు వాషింగ్టన్లో అమెరికా-చైనాల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. వచ్చే అధ్యక్ష ఎన్నికల వరకు వేచి చూడాలని చైనా భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ఈ హెచ్చరిక చేయడం గమనార్హం.













