ఈ నెలలోనే ఆంక్షల ఎత్తివేత దిశగా చర్యలు : ట్రంప్
దేశంలో కొత్త వైరస్ కేసుల నమోదులో తగ్గుదల కనిపిస్తున్నదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఒక్కరోజులోనే అత్యధిక కేసులు నమోదయ్యే స్థితి నుంచి బయటపడ్డామన్నారు. అన్ని కుదిరితే ఈ నెలలోనే ఆంక్షలన్నీ తొలగిపోయి కొన్ని రాష్ట్రాలు మళ్లీ తెరుచుకునే అవకాశమున్నదని అంచనా వేశారు. దేశంలో కరోనా పరిస్థితులపై శ్వేతసౌధంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనాతో యుద్ధం కొనసాగుతున్న ట్రంప్, దేశాన్ని తిరిగి తెరిచేందుకు అనుసరించాల్సిన మార్గదర్శకాల్ని ఈ గురువారం ప్రకటించే అవకాశం ఉన్నదని అన్నారు. అయితే, గవర్నర్లతో సమావేశమైన తర్వాతనే ఈ వివరాల్ని వెల్లడిస్తామని చెప్పారు.













