హెచ్ 1బీ వీసాలపై మరిన్ని ఆంక్షలు!
వర్క్ వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ఆంక్షలు సరిగ్గా పనిచేయకపోవడంతో కొత్త నిబంధనలను రూపొందించేందుకు సమాయత్తమవుతున్నారు. గతంలో నిబంధనలు రూపొందించినా ఇప్పటికే అమెరికాలో ఉన్న కొంతమంది వర్కర్లపై ప్రభావం చూపలేకపోయిందని అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. దీంతో హెచ్ 1బీ వీసా విధానాన్ని మరింత కఠినతరం చేసేందుకు అధ్యక్షుడు ట్రంప్ కొత్త నిబంధనలను ప్రకటించే అవకాశం ఉందని ఏజెన్సీ వర్గాలు తెలిపాయి. ఆ దేశంలో టెక్నాలజీ నుంచి ఆర్థిక రంగం, ఆతిథ్య రంగాల్లో అవకాశాల కోసం దాదాపు 2,40,000 ఉద్యోగ ఆధారిత వీసాలను నియంత్రించాలని ట్రంప్ యోచిస్తున్నారు.













