తాత్కాలికంగా నిలిపివేసిన నిధులను శాశ్వతంగా ఆపేస్తాం : ట్రంప్
వచ్చే 30 రోజుల్లో తన విధానాలను మార్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డబ్ల్యూహెచ్ఒను హెచ్చరించారు. లేకుంటే తాత్కాలికంగా నిలిపివేసిన నిధుల్ని శాశ్వతంగా ఆపేస్తామని వ్యాఖ్యానించారు. అలాగే సంస్థలో అమెరికా సభ్యత్వంపై పునరాలోచించుకోవాల్సి వస్తుందని అన్నారు. కరోనా మహమ్మారిని కప్పిపుచ్చుతూ చైనాకు మద్దతునిస్తోందని, తన అధికారాలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ ఏప్రిల్ మధ్యలో డబ్ల్యూహెచ్ఒకు నిధులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. డబ్ల్యూహెచ్ఒ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్కు పంపిన లేఖను ట్వీట్ చేస్తూ తన స్వీయ వివరణగా ట్రంప్ పేర్కొన్నారు. వైరస్ పుట్టక గురించి ముందస్తు నివేదికలు వస్తున్నా పట్టించుకోకుండా చైనాకు మద్దతునివ్వడం డబ్ల్యూహెచ్ఒ లోపాలకు నిదర్శనమని లేఖలో పేర్కొన్నారు.













