చెప్పింది చేయకపోతే అమెరికా షట్ డౌన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకంగా తమ దేశంలోని ప్రభుత్వాన్నే స్తంభింపచేస్తామని హెచ్చరించారు. ఇమిగ్రేషన్ చట్టాలలో తాను తలపెట్టిన మార్పులకు ప్రతిపక్ష డెమొక్రాట్లు అంగీకరించాలని డిమాండ్ చేశారు. ఇందుకు వారు అంగీకరించకపోతే షట్డౌన్ తప్పదని, ఫెడరల్ ప్రభుత్వం స్తంభించిపోతుందని ట్రంప్ హెచ్చరించారు. కేవలం వలసవాద విధానాలలో కీలక మార్పులే కాకుండా మెక్సికోతో సరిహద్దు విషయంలో నిధులకు చట్టసభలు అంగీకరించకపోతే ప్రభుత్వాన్ని షట్డౌన్ చేస్తామని ట్రంప్ తెలిపారు. సరిహద్దు భద్రతకు తమ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని, ఇక ప్రత్యేకించి దేశంలోకి విదేశీయుల వలస, వారికి స్థిర నివాసం కల్పన వంటి అంశాలతో తాము జాతీయవాదంతో వ్యవహరిస్తున్నామని, అయితే కాంగ్రెస్ నుంచి తగు విధంగా నిధుల మంజూరికి అనుమతి రాకపోతే ప్రభుత్వాన్ని స్తంభింపచేయడమే తమ ముందున్న తక్షణ కర్తవ్యం అని ట్రంప్ పేర్కొన్నారు. వాల్, వీసాలకు సంబంధించిన లాటరీ, నిర్బందాలు, తరువాత విముక్తి వంటి ఘట్టాలు అన్నీ వైదొలగాలి.













