ఆయనంటే మిషెల్‌కు, హిల్లరీకి ఇష్టం….
ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వీ వైన్‌స్టీన్ అత్యాచార కేసులో దోషిగా తేలడం మహిళలు సాధించిన ఘన విజయమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఆయనంటే తను ఏనాడు అభిమానం లేదని, డెమోక్రాటిక్ పార్టీ నేతలు మిషెల్ ఒబామా, హిల్లరీ క్లింటన్ వంటి వారు మాత్రం ఆయన్ను బాగా ఇష్టపడతారని వ్యాఖ్యానించారు. వైన్‌స్టీన్‌తో తనకు పెద్దగా పరిచయం లేదని, డెమోక్రాట్లకు ఆయన భారీగా డబ్బులిచ్చారని ట్రంప్ ఆరోపించారు. న్యూయార్క్ న్యాయస్థానం అత్యాచార కేసులో వైన్‌స్టీన్‌ను దోషీగా పేర్కొంటూ తీర్పు వెల్లడించింది.













