భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి మద్దతు : ట్రంప్
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి శాశ్వత సభ్యత్వంతోపాటు అణు సరఫరాదారుల గ్రూపు (ఎన్ఎస్జీ) వంటి బహుళపక్ష సంస్థల్లో చేరేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు తాను మద్దతినస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి అమెరికా తన మద్దతును పునరుద్ఘాటించింది అని మోదీ, ట్రంప్ సమావేశం అనంతరం విడుదలైన భారత్-అమెరికా సంయుక్త ప్రకటన పేర్కొంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక భాగస్వాములుగా, ఎన్ఎస్జీ, వాస్సెనార్ అరేంజ్మెంట్, ఆస్ట్రేలియా గ్రూప్లో భారత్ సభ్యత్వానికి అమెరికా సంపూర్ణ మద్దతును ఇస్తున్నది అని ఆ ప్రకటన తెలిపింది.













