ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రాయబార కార్యాలయం
లండన్లోని థేమ్స్ నదికి సమీపాన రూ.6440 కోట్లతో అమెరికా రాయబార కార్యాలయాన్ని నిర్మించింది. స్ఫటికాకార ఘనచతురస్రాలను పోలిన నిర్మాణాలతో ఇంధ్రభవనాన్ని తలపించేలా ఉన్న ఈ భవంతిని ఫిలడెల్ఫియాకు చెందిన కైరన్ టింబర్లేక్ డిజైన్ చేశారు. 518 వేల చదరపు అడుగులు, 12 అంతస్థులున్న ఈ భవనంలో 800 సిబ్బంది విధులు నిర్వహిస్తారు. వ్యర్థజలాలను శుద్ధి చేసి పునర్వినియోగం చేయడం, భవనానికి కావాల్సిన విద్యుత్తు కంటే అధిక సౌరవిద్యుత్తు ఉత్పత్తిచేయండం, అరుదైన మొక్కలతో 12 ఉద్వానవనాలు, అమెరికా రాజ్యాంగంలోని స్ఫూర్తిదాయకమైన వ్యాఖ్యలను స్ఫటికాలపై చెక్కడంవంటి అనేక ప్రత్యేకతలు దీని సొంతం. జనవరి 16, 2018లో దీన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు.













